ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 136| 24th August 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 136
వక్తలు :
- శ్రీమతి బాదం లక్ష్మీ కుమారి, కాకినాడ
- శ్రీ ఇళ్లా సత్యనారాయణ, కాట్రావులపల్లి
281 వ పద్యము
పెక్కురు వంచకుల్ గురుల పేరున వత్తురు వారి చేతిలోఁ
జిక్కకు ప్రేమభావములచే మతి ముక్కలుచేసివేసి కై
పెక్కగ భ్రాంతి బెట్టి మరలింతురు దుమ్మయిపోవ ధర్మమున్
నిక్కమునందు నీ తనువు నీరయిపోయిన మానఁబోకుమీ.
282 వ పద్యము
లోపములున్నవారు గుణలుప్తులు మూర్ఖులు స్వార్థలాభసం
తాపమునన్ బరార్థ సముదాయములన్ హరియించు శుంఠలున్
గాపురుషుల్ ప్రబోధకులుగాఁ గనవత్తురు కొందఱీ మహా
పాపుల మాయలన్ బడనివారలె జ్ఞానము నేర్తురారయన్.