ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 147| 09th November 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 147
వక్తలు :
1.శ్రీమతి వనపర్తి మాధురి, విశాఖపట్టణం
2.శ్రీమతి నంబూరి శిరీష, హైదరాబాద్
303 వ పద్యము
గోరీలన్న ఫకీరులున్ ఋషులు ముక్తుల్ పండి నిద్రించు నా
గారంబుల్ పరికింపఁగా “హసనుఖిర్ఖానీ”కి “బుస్తామి” తా
గోరీ నుండి ఖురాను నేర్పె రవియున్ గుఱ్ఱంబుగా వచ్చి సొం
పారన్ వేదము యాజ్ఞవల్క్యునకు నేర్పన్ జాలె మర్త్యాకృతిన్.
304 వ పద్యము
ఎందరొ యీ సమాధుల నదే పనిగా నిదురించుచుండి రిం
దెందరు లేచిరో మఱియు నెందరు నిద్రను జెంది పూఁడి యీ
చందము నేరనట్టి తెరచాటున మాటయి మాటలాడ కే
కుందుచునుండిరో తెలుపు కోవిదుఁ డొక్కఁడు లేఁడు చూడఁగన్.