ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 153| 21st December 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 153
వక్తలు :
- శ్రీమతి వనపర్తి వసుంధర, విశాఖపట్నం
- కుమారి మైలవరపు ఉమా మహేశ్వరి, జగన్నాథపురం
315 వ పద్యము
లోకము లశ్రుపూరమగు లోచనముల్ బచరించు నాకళా
లోకనమందు దహ్యమగు లోపములన్ సవరింపలేక దుః
ఖాకరమైన చిత్రములయందు లయం బయిపోయి చెల్లరే
నాకము గానలేకఁ బ్రవినాశ పథంబునఁ బోదు రయ్యయో!
316 వ పద్యము
శా. ఆలోచించితి మెల్ల మార్గములు దివ్యాదర్శమౌ జ్ఞాన వి
ద్యాలోకంబున మూఁడు లోకములు మాయందే విరాజిల్లు నీ
లోలత్వంబు వృథా ప్రయాసములలో లుప్తంబులై యున్న మో
దాలన్ నిల్కడ లేదు తథ్యమగు మోదంబొక్క వైరాగ్యమే.