ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 168| 29th March 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 168
వక్తలు :
- శ్రీ సంకు శ్రీ కార్తికేయ, హైదరాబాద్
- శ్రీమతి వనపర్తి మాధురి, విశాఖపట్నం
345 వ పద్యము
చ. నెల నుడుకోటి మబ్బు తెరనించి వెలుంగును మాటుసేయు నె
చ్చెలుల దుమారమున్ గలిపి చేట్పడు నైతికరాజకీయ వా
ర్తల నెవరాలకింతురు పరస్పర ప్రత్యయనేయబుద్ధు లా
వల పతితావశేషములఁ బాయరు బాములు వడ్డకాలమున్.
346 వ పద్యము
ఉ. కల్లలు భావజన్యములు జ్ఞానపథంబున మాటలాడఁగాఁ
జెల్లదదేది యీశ్వరుని జేరెడు త్రోవ యథార్థమేది సం
ధిల్లు నిజాత్మతత్త్వమును దృష్టిగతం బొనరించు నేది యా
యుల్లము భావగీతములతో నలరించి యెఱుంగఁగావలెన్.