ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 174| 17th May 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 174
వక్తలు :
- శ్రీమతి అన్నాప్రగడ విజయలలిత, హైదరాబాద్
- కుమారి తుమ్మల పుష్ప వెంకట కృష్ణవేణి, పులిమేరు
357 వ పద్యం
ఉ. పువ్వులమధ్య తుమ్మెదలు పోవుచు మోదము నొందుచుండఁగా
నివ్వసుధన్ పురుంగులు వసించి ప్రమోదముగాంచు మోదమున్
నెవ్వగలర్థ భేదముల నేర్పడు నెల్లర కొక్కరీతి యీ
దివ్వె పతంగభంగమును తేజమునిచ్చు నయాచితంబుగన్.
358 వ పద్యం
చ. తెలిసిన వన్ని మిథ్య లవి తెల్వికి నందని యంతలోఁతులోఁ
గలవు సుమంబు వాసనలఁ గ్రాలిన రాలెడు నైజమున్న దా
విలసన వైఖరిన్ నలిపివేసిన రూపరి మాఱిపోవు నీ
కలన నిజంబు గూఢ మయి కానఁగరాదు జడత్వ మర్థికిన్.