ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 116| 06th April 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 116

వక్తలు :

  1. కుమారి షేక్ అమీనా షహనాజ్, కాకినాడ
  2. కుమారి దొండపాటి ఉమామహేశ్వరి, సింగరాజుపాలెం

239 వ పద్యము
మీరు నిరీశ్వరుండని గమించెఁడు వాఁడు నిషిద్ధ జీవనా
కారమలీమసంబయిన కష్టములన్ నివసించి యెప్పుడె
వ్వారిని హింస సేయఁ డభివంచితమౌ చషకాన సీధువే
సారసనేత్రొ నవ్వుచు నొసంగనదే దివియంచు నెంచెడున్

240 వ పద్యము
ఆ విరిఁబోఁడి నవ్వి వికచాకృతి వెన్నెలఁ దెచ్చి పెట్టె నా
హా! వెలలేని యా నగవునం దవె రాలెడు మౌక్తికంబులా
జీవముగన్న చిత్తరువు చీరముసుంగున స్వర్గతేజ మెం
తో విరజిమ్ము సోయగము తోరణఁ గట్టిన యట్లు చూచితే

You may also like...