ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 175| 24th May 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 175

వక్తలు :

  1. శ్రీమతి వేగేశ్న రేవతి, హైదరాబాద్
  2. శ్రీమతి దుగ్గన భాస్కర లక్ష్మీ పార్వతి, ఏలూరు

359 వ పద్యం
ఉ. ఆసవపానమందు నడియాస వికాసము భాసమానసం
వాసితమైన ప్రేమరస వాసితమైన వధూవిలాస వి
న్యాసము లాప్తవర్గ పరిహాసక ధూర్వహమైన తృప్తి కై
లాసముకన్న గొప్పదని లాస్యముజేసెడు చూచితే చెలీ!

360 వ పద్యం
శా. ఏదో ఘోరవిషంబు వహ్నివలె నెంతే కాలగర్భంబులో
ప్రాదుర్భావము నొంది పిట్టపిడుగుల్ వర్షింపఁగావచ్చు నా
పాథోరాశి తరంగమాలికలలో ద్వారాలు భేదించి నిః
ఖేదంబైన పథాన నీవనెడు వ్యక్తిన్ నిల్పి మోదించుమా!

You may also like...