ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 178| 14th June 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 178
వక్తలు :
- శ్రీమతి సాగి ఉషశ్రీ, విశాఖపట్టణం
- శ్రీ నల్లపరాజు కిశోర్, హైదరాబాద్
365 వ పద్యం
శా. యావజ్జీవము విద్య నేర్చినను బ్రహ్మాండంబులో నొక్క సం
ఖ్యావృత్తంబు తరింపలేరు మఱి యీ వ్యాఖ్యానకారుల్ మహాం
ధీవిధ్వాంత తమో నిగూఢమతి వాదింపన్ బ్రవర్తింతు రా
యా వాదంబులఁ గల్గఁ డీశ్వరుఁడు నీవై యుంటివీ వారయన్.
366 వ పద్యం
ఉ. ఊహలు భ్రాంతిజన్యములు నున్నవి లేనివి చేర్చి చెప్పు సం
దేహమతుల్ భవాబ్ధి కడతేఱఁగ లేరు నిజంబు నాత్మలో
సాహసముంచి చెప్పుమట చిక్కు ఘటించిన తప్పులేదు; నీ
యైహికమందు వ్యక్తిగతమైన ప్రపత్తి ప్రతిష్ఠ చేయుమా!