ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 189| 30th August 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 189
వక్తలు :
- శ్రీమతి తోట వెంకట రత్నం, అత్తిలి
- శ్రీ అల్లం శివ దుర్గ రాజేంద్ర గోపాల్, ఏలూరు
387 వ పద్యం
మ. సెలయేళ్ళుండెడు చోటఁ బచ్చికలు సంఛిన్నుల్ ప్రియుల్ గల్గుచో
టుల బాధల్ విభవోక్తి భక్తి కల చోటుల్ నిందలున్ వచ్చు శృం
ఖలబద్ధం బిది స్వేచ్ఛ లేదవనిలో గర్వాంధులున్ సాధులున్
విలపింపన్ శ్రమ పెట్టుచుందురు తుదిన్ విధ్వంసులై పోవఁగన్.
388 వ పద్యం
శా. నీ సందేశము యోగమార్గముల నెంతే నియ్యఁగా నెంచినన్
నీ సంసార మసార మంచు నెదలో నిర్ధారణన్ జేసి సద్
వ్యాసంగంబుల నేర్చి ప్రాయికము బ్రహ్మానందవారాశిలో
భాసిల్లన్ నిజమాడు మూర్ఖులు నినున్ బాధించినన్ మ్రొక్కినన్