ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 190| 06th September 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 190
వక్తలు :
1.శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి, అమెరికా
2.శ్రీ యర్రంశెట్టి శివన్నారాయణ, బల్లిపాడు
చ. చెదరి వివాదమున్ దగిలి చెన్నరిపోయిన భక్తకోటి నీ
సదమల యోగశక్తిని ప్రశాంతమతిన్ జడబుద్ధి మాన్పి యా
హృదయ కవాటముల్ తెఱచి యీశ్వరరూప కళాప్రసక్తిచే
కదిపి సమాధిలో నిలిపి కాంచఁగ జేయుము విశ్వరూపమున్.
సీ. కొండపైఁ గూర్చున్న గురుని జాడ యెఱింగి
భక్తుండు నీశ్వరుఁ బడయఁగోరు
పడరాని కష్టముల్ పడిపస్తులను తీసి
యెట్టెటో కొండపై కెక్కఁజూచు
ఏనాఁటికైనను నానాప్రయాసాల
శిథిలమై గురుని దర్శించి మ్రొక్కు
ఆ గురుం డతని ప్రేమానురాగము జూడ
కొండపై నేలకుఁ గూలఁద్రోయు
తే.గీ. అయిన విడువక గురుని పాదాంబుజముల
కొఱకు నెగఁబ్రాకి మఱల భక్తుండు కొండ
నెక్కిపోవును ప్రేమ రేకెత్తునట్లు
అట్టివారికె సాయుజ్య మబ్బగలదు.