ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 203| 06th December 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 203

వక్తలు :

  1. శ్రీమతి దాట్ల రాజేశ్వరి, లక్ష్మీనరసాపురం
  2. శ్రీమతి దంతులూరి సుశీల, రాజమహేంద్రవరం

416 వ పద్యం
ఉ. జ్యోతిషు లంద్రు మానవులు నుర్విని చచ్చియు నుర్విఁ బుట్టుచుం
బ్రీతములైన కర్మఫలరీతి వహింతు రటంచు దైహికుల్
భూతలమందు మృత్యుహతిఁ బోయినవారలు నొక్కసారిగా
లేతురటందురీ ప్రళయలీల సమానమె యేరు చెప్పినన్.

417 వ పద్యం
శా. ఆలోచింపరు మూర్ఖమానవు లవిద్యాభ్రాంతి విశ్వంబుఁగా
నాలోకింత్రు ముసుంగుచీఁకటి ప్రభాధ్యాసంబు లీరీతి వి
ద్యాలంకార రసాత్మకం బయిన వ్యాఖ్యానంబులోఁ దోఁచు నా
నా లక్ష్యంబులఁ బుట్టు జచ్చు తనువున్ జన్మాంతరంబే గదా.

You may also like...