ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 204| 13th December 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 204
వక్తలు :
- శ్రీ సాగి బుచ్చి వెంకట నరసింహ రాజు, విశాఖపట్నం
- శ్రీమతి సత్తిరాజు శ్రీలక్ష్మి, భీమవరం
418 వ పద్యం
ఉ. పాపము పుణ్య మంచుఁ బరిపాటిగఁ జెప్పెడు మాటలందు నీ
చూపు పదార్థవాదములఁ జూచుచునున్నది ఖేద మోదమం
దా పరమార్థ వాదము పరాపరమైన త్వదాత్మ మోక్షపున్
రూపము దాల్పదేని యదె రూఢిగ పాపము వేరయున్నదే.
419 వ పద్యం
ఉ. ఊహలు వానిలోఁ గలుగు నున్నతమార్గము సున్న యున్న సం
దేహము బాయకున్న మఱి తేరుట యెట్లని తోఁచెనేని నీ
దేహమునందు జీవుఁడను తెల్వియు స్వప్నములందు నీవు నీ
మోహన విగ్రహంబుఁ గని పోల్చఁగలేవొకొ నీ రహస్యమున్
