ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 35| 17th September 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 35
వక్తలు :

  1. శ్రీ వింజరపు వీరవెంకట సత్యనారాయణ, పిఠాపురం
  2. శ్రీమతి బుద్దరాజు రాధా మాధవీ లత, ఏలూరు

74 వ పద్యము
మేలుకొనుండు నిద్రను నిమీలితలోచనులై ప్రభాతతే
జోలసిత ప్రభాపటలశోభితసృష్టి విలాసవిహ్వలో
ద్వేలనిగూఢతత్త్వ సముదీర్ణ పరంపరఁ జూడకున్న నీ
కాలము వచ్చునే తిరిగి కాంచుదుమే మన మెన్నడేనియున్.

75 వ పద్యము
కాలము పోవుచున్న దొడికంబునఁ బట్టఁగలేము మీరు రా
రేల నిజార్థముల్ చదువరేల ప్రభాతముహుర్త విఘంటికార్థవై
తాళికు లేమిపాడుచు మృదంగము మీటుచు నున్నవారొ మీ
రేల ప్రశాంతులై వినరు నేటికి నేర్వరు బ్రహ్మతత్త్వమున్.

You may also like...