ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 54| 28th January 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 54
వక్తలు :

  1. శ్రీమతి బుద్దరాజు శ్రీదేవి, భీమవరం
  2. శ్రీ అల్లం శివ దుర్గ రాజేంద్ర గోపాల్, పశ్చిమ గోదావరి జిల్లా

115 వ పద్యము
ఏది నిజంబొ యీశ్వరున కేది యథార్థమొ యస్తినాస్తికుల్
కాదను వస్తువేదొ కొఱఁగాని వృథా పరికల్పితార్థ సం
వాదములందు జీవితము వ్యర్థము సేయుచు శూన్యమైన యీ
మేదిని వీడి పోదు రుపమింపరు నీశ్వర రూప మన్నిఁటన్.

116 వ పద్యము
ఒక్కఁడు నాస్తికుండు మఱి యొక్కరుఁ డాస్తికుఁడంచు జెప్పు నీ
ముక్కల కర్థ మొక్కటె ప్రపుణ్యపథంబున నిర్వు రీశ్వరుం
డెక్కడ నుండెనో యనుచు నెంతొ విమర్శనఁ జేసిచేసి యా
ఫక్కిని చెప్పినారరయువారికి వాదమె లేదొకప్పుడున్.

You may also like...