ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 64| 8th April 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 64
వక్తలు :

  1. శ్రీమతి సంకు ఉమామహేశ్వరి, చిన్న కాపవరం
  2. శ్రీమతి ముత్యాల వరలక్ష్మి గారు, రాజపూడి

135 వ పద్యము
నిలువున నిల్చి పాదములు నేరుగ భూమికినంటినట్లుగాఁ
దలఁచి రసాతలాన మహితంబగు శక్తిని లాగుచున్న దృ
క్కులు వివశంబులై కొఱడుకొన్న శరీరము రీతి దాల్చి వి
హ్వలదశ వచ్చి సర్వము బయల్ వలెఁ దోఁచును శూన్యవిశ్వమున్.

136 వ పద్యము
చేతులు రెండు చేర్చి తన చిత్తముతోఁ గనుచూపులందులో
లోఁతుగ పోవనిచ్చి తనలోఁ గల తేజము మేళవించినన్
జేతనరూపక ప్రకృతిచేతఁ జరాచర భూతకోటి సం
ఘాతము సూక్ష్మదేహములఁ గానఁగవచ్చు రసానుషంగమై.

You may also like...