ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 68| 06th May 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 68
వక్తలు :

  1. శ్రీమతి బిర్రా భవాని, విశాఖపట్నం
  2. శ్రీమతి గోపిశెట్టి చరిత, హైదరాబాద్

143వ పద్యము
అద్దమునందు నీ ప్రవిమలాకృతి గన్పడుచుండు కంటిలో
నిద్దురవోయి మ్రాన్పడిన నీ నిజరూపును గూడ యందులో
దిద్దిన రీతి దోఁచునది దృష్టి మరల్పక చూచెనేని యం
దెద్దియొ వెల్గు వచ్చి పరమేశ్వరుఁడో యన గోచరంబగున్.

144వ పద్యము
వీలగు కాలితో బొటన వ్రేలును చాచి సమాధి నిష్ఠ మో
కాలినరంబునున్ గఱచి కట్టియు రేచక పూరకంబులన్
గ్రాలెడు సోహనాదము మొగంబున మూఁడు విధాల త్రిప్పి పిం
గాళ యిడా సుషుమ్నలను గాంచినవారలు గాంతు రీశ్వరున్.

You may also like...