ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 92| 21st October 2023
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 92
వక్తలు :
- శ్రీమతి గుబ్బల భాగ్యలక్ష్మి, లండన్
- శ్రీ ఆర్. కె. గురుప్రసాద్, పిఠాపురం
191వ పద్యము
నీవును నీవయై మఱచి నిద్ర మునింగిన వానిభంగి నీ
భావము మార్చి యందు రసవత్తరమైన సమాధి స్వప్నతు
ల్యావృతమైన దృశ్యముల నంతముగాఁ గనుపించు నందులో
నీవును గానుపింతువదె నిక్కమునైన త్వదీయరూపమున్.
192వ పద్యము
రాతిని బొమ్మఁ జేసి ప్రియురాలనుగాఁ బలికించినట్టు ని
శ్చేతనముల్ జలించు గతి చేయు చలత్ప్రకృతిస్వరూప సం
జాతము దృక్కులన్ నిలుపఁజాలిన వాని నిగూఢ తత్త్వసం
ఘాతము చేతిలో నుసిరికిన్ బురుడించును జోస్యమాడఁగన్.