జ్ఞాన చైతన్య సదస్సు చంద్రంపాలెం | 1st మార్చి 2024

Press note. Chandrampalem 1-3-24
తాత్విక బాల వికాస్ ద్వారా బాల బాలికలు ఆధ్యాత్మిక రత్నాలుగా పరిణామం చెందుతున్నారు అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. శుక్రవారం రాత్రి స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, చంద్రంపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సు కు పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. బాలబాలికలు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన రహస్యాలను పద్యాలు, ప్రసంగాల ద్వారా తెలియ చేసి సభను ఆనందింప చేశారని డా. ఉమర్ ఆలీషా అన్నారు. కుల మత ప్రాంతీయ భాషా భేదాలకు అతీతంగా త్రయీ సాధన ద్వారా భిన్నత్వం నుండి ఏకత్వానికి చేరి, దేశ సమగ్రత విశ్వ శాంతి కి దారి తీయునని డా. ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. తాత్విక బాల వికాస్ విద్యార్థులు జక్కి రాజీలత, సన్నిబోయిన నూకేశ్వర రావు, సన్నిబోయిన ఉమా వర ప్రసాద్ , తల్లిబోయిన హరితేశ్వరి, గుళ్లపల్లి ఉమాదేవి, సన్నిబోయిన ఉషా రాణి, సన్నిబోయిన కృష్ణ ప్రసాద్, N. యశ్వంత్, గురాల ఉమా వైష్ణవి సూఫీ వేదాంత దర్శము లోని పద్యాలు వాటి భావాలు మరియు మొక్కలు నాటుట ద్వారా పర్యావరణ పరిరక్షణ, మరియు నీటిని వృధా చేయరాదని చెప్పారు. శ్రీ తల్లిబోయిన వీరబాబు శ్రీమతి మంగమ్మ దంపతులు, శ్రీ తల్లిబోయిన వీర నాగేశ్వర రావు శ్రీమతి కాసులమ్మ దంపతులు స్వామి వారిని శాలువాలు కప్పి సత్కరించారు. శ్రీ జక్కి సింహాచలం శ్రీమతి నందీశ్వరి దంపతులు స్వామి వారిని పుష్ప మాలాంకృతుల్ని చేశారు. హారతి తో సభ ముగిసింది.
ఇట్లు
పేరూరి సూరిబాబు,
పీఠం కన్వీనర్,
9848921799.

You may also like...