కోటి పార్థివ లింగ మహా రుద్రాభిషేక మహోత్సవం, ఇర్రిపాక | 2nd మార్చి 2024

Press note 2-3-24 ఇర్రిపాక
మనందరిలో భక్తి భావం పెంపొందింప చేసేదే కోటి పార్థివ లింగ మహా రుద్రాభిషేకం అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. శ్రీ జ్యోతుల నెహ్రూ గారి అధ్వర్యంలో నిర్వహించబడుతున్న కోటి పార్థివ లింగ మహా రుద్రాభిషేక మహోత్సవానికి శనివారం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం , పిఠాపురం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహ భాషణ చేస్తూ మనందరం ఆనందంగా, తృప్తిగా, సంతోషంగా జీవించాలంటే, మనందరిలో భక్తి భావం పెంపొందెలా 12 రోజులు ఈ మహోతృష్ట కోటి లింగ పార్థివ రుద్రాభిషేకము నిర్వహిస్తున్న శ్రీ జ్యోతుల నెహ్రూ గార్కి వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని ఆశీస్సులు లభించాలని ఆశీర్వదించారు. భగవంతుని ఆశీస్సులు అనే ఇందనం మానవుని దైనందిన జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదించును అని డా. ఉమర్ ఆలీషా అన్నారు. భగవంతుని సంకల్పం శ్రీ నెహ్రూ గారి మీద ఉండుట వల్ల ఈ 12 రోజులూ ఎదురయ్యే అనేక పరీక్షల ను అధిగమించి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించ గల్గుతున్నారని డా. ఉమర్ ఆలీషా అన్నారు. ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవరుచు కుంటే దైనందిన జీవితంలో మానవుడు నిర్వహించే ఉద్యోగ వ్యాపార వ్యవసాయ తదితర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగల సామర్థ్యం అనే ఇంధనాన్ని భగవంతుడు ఆశీస్సులు రూపంలో ప్రసాదిస్తాడని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు, పీఠం కార్యవర్గ సభ్యులు శ్రీ సలాది రమేష్, శ్రీ రేఖా సత్యనారాయణ, శ్రీ రేఖా ప్రకాష్, శ్రీ YNVKS సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
పేరూరి సూరిబాబు,
కన్వీనర్, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం.
9848921799.

Press – Newsclippings – Videos

https://www.uniindia.com/spiritualism-is-the-key-for-securing-divine-blessings-umar-alisha/south/news/3154252.html

You may also like...