“సస్యవృద్ధి బీజారోపణోత్సవం” – 22 జూన్ 2024 న కార్యక్రమము నిర్వహించబడినది

“సస్యవృద్ధి బీజారోపణోత్సవం” – 22 జూన్ 2024 న కార్యక్రమము నిర్వహించబడినది

ప్రెస్ నోట్
ఏరువాక పూర్ణిమ – రైతు సస్య వృద్ధి బీజరోపణ ఉత్సవం-2024
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం,పిఠాపురం నూతన ఆశ్రమ ప్రాంగణం లో ఏరువాక పూర్ణిమ సందర్భంగా పీఠాధిపతి శ్రీ ఉమర్ ఆలీషా వారు ఆశ్రమ వ్యవసాయ క్షేత్రం లో అరక కట్టి నాగలి పట్టి పొలం దున్ని ఏరువాక ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు కుటుంబాలు వారు కూడా వచ్చి గురు వర్యులు చేతులు మీదుగా ఎడ్లకు ధాన్యం, బెల్లం తినిపించి పసుపు,కుంకుమ వ్రాసి భారతీయ సంస్కృతి,సాంప్రదాయం ప్రకారం ఏరువాక ప్రారంభం చేశారు.గురు వర్యులు సోదరులు శ్రీ అహమద్ ఆలీషా వారు కూడా నాగలి పట్టి గురు వర్యులు తో కలిపి ఏరువాక సాగించారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు ఆధ్యాత్మిక వ్యవసాయం ద్వారా మాత్రమే ప్రతీ రైతు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మానవ సమాజానికి అందించ గలరని,ప్రకృతి, సిద్ధంగా వ్యవసాయం చేస్తూ,సేంద్రియ ఫలసాయం పై దృష్టి పెట్టీ వ్యవసాయ వనరులు భూమి,నీరు,విద్యుత్ వినియోగం లో విచక్షణ పాటిస్తూ లాభదాయకమైన వ్యవసాయాన్ని చేసి రైతు రాజు కావాలని కోరారు. రైతులకు సద్గురు దివ్య బీజాలు, అధిక దిగుబడి నిచ్చే 9 కూరగాయ విత్తనాలు పంపిణీ చేశారు. తదనంతరం పీఠం యొక్క సభా మందిరం లో ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పై అవగాహన సదస్సును జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ శాస్త్రజ్ఞులు,అధికారులు డాక్టర్ శ్రీ ఎ.వి.రామాంజనేయులు, డా.శ్రీమతి నీలిమ, డాక్టర్ రామ గోపాల్ వర్మ, డా.శ్రీమతి రత్న ప్రశాంతి, వ్యవసాయ అధికారి శ్రీ సి.హెచ్.సత్యనారాయణ గారు, శ్రీమతి అరుణ గారు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం పై, నీటి యాజమాన్య పద్ధతులు పై,సేంద్రియ ఎరువులు తయారీ పై,భూసార పరిరక్షణపై, చీడపీడలు నివారణపై మంచి విత్తనాలు వాడకం పై,సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు పై అవగాన సదస్సును నిర్వహించారు. సుమారు నాలుగు వందలు మంది రైతులు ఇందులో పాల్గొని శిక్షణ పొందిరి. ఐదుగురు విశిష్ట సేంద్రియ వ్యవసాయ రైతులకు గురు వర్యులు డాక్టర్ ఉమర్ ఆలీషా వారి చేతులు మీదుగా సన్మానం చేసారు. గురు వర్యులు తండ్రి గారైన శ్రీ మొహియుద్దీన్ బాద్షా వారి స్మారక రైతు పురస్కారం-2024 పదివేల రూపాయలు నగదు బహుమతి, జ్ఞాపికను తూర్పు గోదావరి జిల్లా ఆదర్శ రైతు ఆదివిష్ణు గారికి అందచేసారు. పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు శ్రీ ఎ.వి.వి.సత్యనారాయణ గారు కార్యక్రమం నిర్వాహకులు గా కార్యక్రమానికి తొలిపలుకులు పలికారు. శ్రీ ఎన్.టి.వి.ప్రసాద్ వర్మ సెంట్రల్ కమిటీ సభ్యులు వందన సమర్పణ చేసారు. వచ్చిన రైతు సోదరులకు, అతిథులకు ఏరువాక పూర్ణిమ పర్వదినం సందర్భంగా అన్న ప్రసాదం, విందుభోజనం ఆశ్రమంలో ఏర్పాటు చేయబడినది.

You may also like...