ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 127| 22nd June 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 127

వక్తలు :

  1. శ్రీ యర్రంశెట్టి శివన్నారాయణ, బల్లిపాడు
  2. శ్రీ యిర్రి వెంకట రామకృష్ణ, అత్తిలి

259 వ పద్యము
నైతికమైన మార్గము జనంబులు మెచ్చినఁ బెక్కు చోటులన్
నైతిక బాహ్యవర్తన గనంబడుచున్నది కాని కొందరా
నీతిని మాని జీవితము నింద్యముగాఁ గనపర్చి యీశ్వరో
ద్భూతచరాచరంబయిన భూమిని తామయి యాక్రమించెడున్.

260 వ పద్యము
మున్నల యాజ్ఞవల్క్యుఁడు నభోమణిలోపలి శక్తి లాగి య
భ్యున్నతి వేదమున్ బడసె; నుర్వి శశాంకుని దింపి యీశ్వరుం
డన్నిటలో మహమ్మదు మహాత్ముఁడు చూచి ఖురాను దెచ్చె; నీ
తెన్నున సాధకుండు తన తేజముతో దివి దింపు నేలకున్.

You may also like...