ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 173| 10th May 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 173

వక్తలు :

  1. శ్రీమతి దిడ్డి శ్రేయ, మస్కట్
  2. శ్రీమతి తోట లక్ష్మీ ఉమామహేశ్వరి, జాలిపూడి

355 వ పద్యం
ఉ. నీవను యోడ నీ బ్రతుకు నిర్ఝరిలోపల వీడు మద్ది యే
త్రోవకొ లాఁగివేయు నదె తోరపు శాంతిపథంబు గాగ నీ
భావము మార్చు మా మధురపానము మైకము గూర్చునందు నా
నావిధ వాసనార్థ మలినంబు లయం బయిపోవు నెచ్చెలీ!

356 వ పద్యం
శా. కాలం బంతయు మాఱిపోయినది, యా కావ్యాలలో పాట లీ
వేళన్ బాడిన నవ్విపోదురు జనుల్, విద్యుల్లతాతన్వి యె
న్నో లాస్యంబులు జేయుచున్నది తెరల్ ద్యోవీథి భేదించి నీ
లో లావణ్యముఁ జూపి వాని తెగువన్ బోకార్చుమా వేకువన్.

You may also like...