ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 186| 09th August 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 186
వక్తలు :
- శ్రీమతి అల్లూరి అనురాధ, హైదరాబాద్
- శ్రీ అల్లం నాగమల్లి ప్రమోద్ కుమార్, ఏలూరు
381 వ పద్యం
శా. పూజాపద్ధతి నీవెఱుంగునెడ నీ భూమిన్ బ్రదీపించి వి
భ్రాజిష్ణుత్వము గన్న నీ ప్రజల సంభావించు నీ వందులోఁ
దేజంబై భవదీయ తేజమున నుత్తేజంబుఁ గల్పింపుమా
యోజన్ దేశము భాగ్యలక్ష్మి కిరవై యొప్పారుఁ గల్పాకృతిన్.
382 వ పద్యం
చ. ఒక ధనురాధికారి యగు యోగి విలాసములందు చేడ్పడన్
బకపక నవ్వి శిష్యు లెడఁ బాసిన కొండొకఁ భక్తుఁడుండి జా
రక వెనువెంట నంటి యలరారఁగ సద్గతిఁ దెచ్చినాఁడు త
త్ప్రకరణముల్ జగాన హితవార్ధిని రత్నములట్లు గ్రాలెడున్.