కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 78 వ వర్ధంతి సభ – Kavisekhara Dr.Umar Alisha 78th Vardhanthi Sabha – 23-Jan-2023

కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 78 వ వర్ధంతి సభ – 23 జనవరి 2023

ప్రెస్ నోట్

Dt. 23.01.23, భీమవరం

మహిళాభ్యుదయం కోసం పాటుపడిన మహనీయుడు ఉమర్ అలీషా ………పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా

భీమవరంలో ఘనంగా కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా 78వ వర్ధంతి సభ

సత్యవోలు లలిత కృష్ణ ప్రసాదరావుకు హుస్సేన్ షా కవి పురస్కారం

కిరణ్ ప్రభకు ఉమర్ అలీషా కవి పురస్కారం అందజేత

మహిళాభ్యుదయం కోసం పాటుపడిన మహనీయుడు పూర్వ పీఠాధిపతి ఉమర్ అలీషా అని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్. ఉమర్ అలీషా అన్నారు.

డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితి ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం జువ్వల పాలెం రోడ్డులో ఉన్న ఆనంద్ ఫంక్షన్ హాల్ నందు సోమవారం నిర్వహించిన దివంగత 6వ పీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా 78వ వర్ధంతి సభకు ఆలీషా అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ చిన్నతనంలోనే సాహితీ సేవను ప్రారంభించిన మహానీయుడు కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా అని తెలిపారు. 18వ శతాబ్దంలో సమాజంలో స్త్రీల వెనకబాటుతనాన్ని గుర్తించి స్త్రీ జనోద్ధరణకు పాటుపడిన మహనీయుడు ఉమర్ అలీషా అని పేర్కొన్నారు. సమా జాన్ని అధ్యయనం చేసిన ఆయన సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర సమరయోధుడిగా, కవి, రచయితగా మహిళాభ్యుదయానికి, హరిజనోద్దారణకు నిరంతరం కృషి చేసారని వెల్లడించారు.

ఉమర్ ఆలీషా సాహితీ సమితి ద్వారా అందిస్తున్న హుస్సేన్ షా కవి స్మారక సాహితీ పురస్కారాన్ని హైదరాబాద్ కు చెందిన సాహితీ సేవకుడు సత్యవోలు లలిత కృష్ణ ప్రసాదరావుకు, ఉమర్ అలీషా కవి పురస్కారాన్ని సాహితీ విశ్లేషకుడు అమెరికాకు చెందిన కిరణ్ ప్రభకు అందించడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.

ఉమర్ ఆలీషా సాహితీ సమితి ద్వారా భీమవరంలో 30 సంవత్సరాలుగా విశిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తూ సాహితీ సేవ చేస్తున్న సమితి సభ్యులను పీఠాధిపతి అభినందించారు.

పురస్కార గ్రహీతలు సత్యవోలు లలిత కృష్ణ ప్రసాదరావు, కిరణ్ ప్రభ, ప్రత్యేక ఆహ్వానితులు ఆచార్య గిరిజా మనోహర్ బాబు, ఆనంద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు మాట్లాడుతూ సాహిత్యానికి కుల మతాలు లేవని, సమాజ హితాన్ని కోరేది సాహిత్యమని వెల్లడించిన మహోన్నత వ్యక్తి ఉమర్ ఆలీషా అని కొనియాడారు.

అనంతరం పీఠాధిపతి ఉమర్ అలీషా పురస్కార గ్రహీతలకు స్మారక పురస్కా రాలను, ఇద్దరికీ 25,116 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేసి ఘనంగా సత్కరించారు

ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి
దాయన సురేష్ చంద్రజీ, ఉపాధ్యక్షుడు
త్సవటపల్లి మురళీకృష్ణ, కోశాధికారి
వడ్డాది శ్రీ వెంకటేశ్వర శర్మ, వేగేశ్న సత్యవతి, వడ్డి విజయలక్ష్మి, త్సవటపల్లి
సాయి వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

You may also like...