ది 23 జనవరి 2023 గురువారం ఉదయం కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల ‘కవిశేఖర’ డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి విగ్రహ ప్రాంగణంలో వారి 78వ వర్ధంతి సభ నిర్వహించబడినది

ప్రెస్ నోట్
సాంఘిక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్న సమాజాన్ని సంస్కరించిన మహనీయుడిని శ్రీ అహ్మద్ ఆలీషా అధ్యక్ష ప్రసంగం చేశారు.23-1-23 సోమవారం ఉదయం కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి 78 వ వర్ధంతి సభకు పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా స్వామి సోదరుడు అహ్మద్ ఆలిషా అధ్యక్షత వహించగా, మరొక సోదరుడు హుస్సేన్ షా, ముస్తఫా పాషా,కాకినాడ MP శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్, కాకినాడ రూరల్ శాసన సభ్యులు శ్రీ కురసాల కన్నబాబు, కవి శిరీష, నవరస Dr G.నమశ్శివాయ, పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు, సెంట్రల్ కమిటీ సభ్యుడు శ్రీ Avv సత్యనారాయణ, సలాది రమేష్, శ్రీ యార్లగడ్డ దనంజయ తదితరులు పాల్గొన్నారు. విశేష సేవలందించిన శ్రీ చిర్ల వెంకట రెడ్డి, శ్రీమతి రెడ్డి సూర్య ప్రభావతి, శ్రీమతి మడకా రామ లక్ష్మి, శ్రీమతి గ్రంధి లక్ష్మి, శ్రీమతి మండా కృపావతి, శ్రీమతి కాకినాడ లక్ష్మి, లక్ష్మి ఫ్రూట్స్ అధినేత శ్రీ రాధాకృష్ణ, శ్రీమతి మండా యల్ల మాంబ, శ్రీమతి బాదం లక్ష్మీ కుమారి, శ్రీమతి దాట్ల శ్రీదేవి, శ్రీమతి వనుము మాణిక్యాల రావు, తదితరులకు శ్రీ ఆలీషా గారు, పక్షులకు ఆహారంగా, ధాన్యపు కుచ్చులు అందచేశారు.
శ్రీ హుస్సేన్ షా మాట్లాడుతూ ఈ పీఠం ద్వారా ధార్మిక విజ్ఞాన ప్రచారం గావిస్తు, సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక సేవలు అందించారని కొనియాడారు. శ్రీ పేరూరి సూరిబాబు మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమర యోధుడుగా మహాత్మా గాంధీ గారితో, స్వాతంత్ర్య సముపార్జనకు కృషి చేశారని, అఖిల భారత శాసన సభ కు 10 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్ గా సేవలు,50 కి పైగా గ్రంధాలు రచించిరి బహుముఖ ప్రజ్ఞాశాలి, శతాబ్దాల చరిత్ర గల పీఠానికి పీఠాధిపతి గాను సేవలందించిన, వజ్రసమానుడు డా. ఉమర్ ఆలీషా అని శ్లాఘించారు.
అహ్మద్ ఆలీషా గారు మాట్లాడుతూ ఉమర్ ఆలీషా గారు వారి రచనల ద్వారా అంటరానితనం, అస్పృశ్యత, సామాజిక వెలివేతల మీద అనేక నవలలు , నాటకాలు రచించారు. సమకాలీన రాజకీయ పరిణామాలకు, ఆయన వ్యక్తిగా, పీఠాధిపతి గా, దేశ భక్తునిగా స్పందించారు.
ఎంపీ శ్రీమతి వంగా గీత,MLA శ్రీ కన్నబాబు, అహ్మద్ ఆలీషా, హుస్సేన్ షా గార్లు కవి శేఖరుని గజమాల తో సత్కరించి,నమస్కరించుకుని, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శ్రీ అడబాల రత్న ప్రసాద్, శ్రీ బద్దరాజు సత్యనారాయణ రాజు, శ్రీ రేలంగి బాపి రాజు వందలాది సభ్యులు పాల్గొన్నారు. హారతి తో సభ ముగిసింది.
ఇట్లు
పేరూరి సూరిబాబు,
కన్వీనర్
9848921799.

You may also like...