ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 117| 13th April 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 117

వక్తలు :

  1. యిర్రి నాగసూర్య ప్రసాద్, అత్తిలి
  2. దాట్ల హరిత, విశాఖపట్టణం

241 వ పద్యము
నీవిడుచున్న నీ మధువు నేను గ్రహించుట కేమి వింత నీ
వావల కేగితేని యిడు నంబుజనేత్ర లభించకున్న నీ
భావము బంధమై మతిని బట్టి యధోగతి దెచ్చిపెట్టదే
దేవి యిదే ప్రమాణమని తెమ్ము ప్రమోదముతోఁడఁ ద్రావెదన్

242 వ పద్యము
భైక్షికమైన నీ మధువు పాత్రను బోసి యొసంగుచుంటి వే
ణాక్షి త్వదీయ రాగరస మందిది యెన్నవపాలు నీ సుధా
ధ్యక్షవిలాస వై ఖరులహర్నిశముండునె జారిపోక నీ
దీక్ష తపస్సుకన్నఁ గడు తియ్యని కైపిడుచున్న దుగ్మలీ.

You may also like...