ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 13| 16th April 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 13

వక్తలు :
చిరంజీవి ఎండూరి ఉషాకిరణ్, అత్తిలి
చిరంజీవి సంతోష్, గోరఖ్పూర్
కుమారి చింతపల్లి అమృతవల్లి, ఇసుకపల్లి

24వ పద్యము:
అతనిజనకుండు బాల్యంబునందు పోయె
నంత తత్త్వవిజ్ఞానంబు నభ్యసించు
కొఱకు “ఆఖైలలీ” గురువరునిఁ జేరి
సిద్ధిగాంచెను యోగప్రసిద్ధుఁ డగుచు.

25వ పద్యము:
వానికి మువ్వురాత్మజులు వర్ధిలి రందు మొహియ్యదీనుబా
ద్షా నవభావకోవిదుఁడు తత్త్వవిదుండు సమస్త ధర్మవి
జ్ఞానకళాకలాపుఁడు నఖండమహామహిమా స్వరూపుఁడై
మానవకోటిశిష్యులుగ మార్చెను నెన్మిదివేలు లెక్కిడన్.

26వ పద్యము:
సీ. పారసీసంస్కృతభాషార్ణవంబును
తరచి సారముఁదీసి తఱుఁగనట్టి
బ్రహ్మవిద్యాసక్తి పరమాత్మతత్త్వంబు
నంతరంగంబున నరసి యరసి
నిజతేజమున నిల్పి నిరవద్యమైన స
మాధినిష్ఠను బూని మాయనంట
కా పరంజ్యోతిలో నైక్యమై బ్రహ్మస్వ
రూపమే నని చెప్పి రూఢమతిని

తే.గీ. ఏ మహాత్ముఁడు మానసభూమి త్రవ్వి
జ్ఞానరసవాహినులఁ దీసి సర్వశూన్య
ప్రకృతిలోపల తేజంబుఁ బడసె నట్టి
శ్రీ మొహియదీనుబాద్ష వర్ణింప దరమె.

You may also like...