ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 14| 23rd April 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 14

వక్తలు :
1.శ్రీమతి రామిశెట్టి సాయి ప్రసన్న, హైదరాబాద్
2.చిరంజీవి టి. ప్రణయ్ గీత్, బెంగుళూరు
3.కుమారి తిరుమలరాజు లక్ష్మి పల్లవి, విశాఖపట్నం

27వ పద్యము.
హృదయకవాటముల్ తెఱచి యిద్ధ తమస్సును జ్ఞానభాస్కరుం
బొదవి వెలార్చి నా తెఱవుఁ బోయి కళాకలితంబునైన యా
సదనమునందు చక్షులను జాలము నుండి హరిస్వరూపమున్
మొదలగపర్చె నా గురుని మ్రొక్కెద శ్రీ మొహిదీనుబాదుషన్.

28వ పద్యము
పదియుఁ దొమ్మిది నూఱ్లిరువదియు నెనిమి
దేండ్లు రెండవ నెలకు నూరేండ్లు నిండ
క్రీస్తుశకమున మా తండ్రి స్వస్తి జెప్పె
భౌతికము బాసి నిలువ తత్ప్రత్యగాత్మ.

29వ పద్యము
ఆ మహనీయవైభవ మహామహితంబగు బ్రహ్మతత్త్వవి
ద్యామహితాత్మకంబును ప్రధానము జేసి నిజస్వరూపసౌ
దామిని సాత్వికత్వపరిధానములన్ బతిపూజఁ జేసి స్వ
ర్ధామము గట్టె మా జనని ధన్యత మ్రొక్కెద చాన్బియాంబికన్.

You may also like...