ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 156| 11th January 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 156

వక్తలు :

  1. శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి, అమెరికా
  2. శ్రీమతి శ్రీశైలపు శ్రీదేవి, విశాఖపట్టణం

321 వ పద్యము
ఉ. కొండల జారు నేళ్ల వలె కోమలమున్ దిగజార్చి కాలనా
థుండు వినీలజాలములు తోమియు తెల్లగ మార్చివేసె నీ
పండిన నెత్తిపూలు ముడువం దలపోసెదవేల నీ వయో
భాండము బ్రద్దలై రసము వాయక పూర్వమె సొంపు నింపుమా!

322 వ పద్యము
శా. నీకున్ దోఁచినదెల్ల నిక్కములుగా నిర్ధారణన్ జేయకా
లోకింపన్ దెరచాటు యా నిజము నీలోనున్నదే యున్నదం
దేకొద్దీ మలినావభావములుగా నీక్షింపఁగా వచ్చినన్
జీఁకట్లున్నవటంచు నెంచు మట ప్రాచీనోదయోద్భాసమున్

You may also like...