ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 188| 23rd August 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 188
వక్తలు :
- కుమారి మైలవరపు ఉమామహేశ్వరి, జగన్నాథపురం
- కుమారి Dr. దొండపాటి ఉమామహేశ్వరి, హైదరాబాద్
385 వ పద్యం
ఉ. కానక పాడులోహమున ఖడ్గమొనర్చిన మంచిదౌనె వి
జ్ఞానము నీచభావులకుఁ గల్గునె నేరక యెంతమంచి వి
ద్యానిలయంబు లున్న; జలదంబు పవిత్రజలంబు లిచ్చినన్
గానను పువ్వు లొక్కయెడ కంటకముల్ జనియించు నొక్కెడన్.
386 వ పద్యం
ఉ. బాధల నెల్ల నోర్చుటకుఁ బాల్పడవేని హరిప్రసంగ సం
బాధము లాలకింప కట పాదము మోపకు పాఱిపొమ్ము యీ
గాథ లగాధము ల్వరను గప్పినకత్తి విధాన ఘోరపా
థోధి తుఫానులోఁ బడిన యోడనుబోలిన జీవితం బిదిన్.