ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 88| 23rd September 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 88

వక్తలు :

  1. శ్రీమతి ఉమా ముకుంద, కాకినాడ
  2. శ్రీమతి నాగ దివ్య పొత్తూరి, USA

183వ పద్యము
ఉరుములు కందరంబులు మహోదధులంబుదముల్ నదుల్ వనుల్
తరువులు గాలిచేఁ గనలి తాత్త్వికమైన ప్రసన్నగానసం
భరితరసాప్తి నించి తమ వాఙ్మయ మేయెడ పాడుచుండు నా
తెఱవులు తార్కికంబులగు తీరులెఱుంగుచుఁ బుచ్చు కాలమున్.

184వ పద్యము
ఏటికి వట్టి వ్యాసములు నేమిటి యున్నది తుక్కు దానిలో
చాటు పదార్థవాద మగచాటులఁ బెట్టుచునుండు తార్కికా
ర్భాటముచేతఁ జేతమును భంగమొనర్చకు వారిఁ జేరి నీ
వీటిని మాటలాడునదె విశ్వసరస్వతి నాలకింపుమా!

You may also like...