ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 193| 27th September 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 193

వక్తలు :

  1. శ్రీమతి కూత ఉమాశ్రీ వినయవతి, విశాఖపట్టణం
  2. కుమారి దాసం లోహితాక్ష, ఉరదాళ్ళపాలెం

395 వ పద్యం
ఉ. సేవలు జేసి చేసి ఫలసిద్ధిని గాంచక మోసపోయి యీ
జీవిత మెట్లు సార్థకముఁ జెందునొ యన్న నితాంతభీతి నా
నావిధ తార్కిక ప్రవచనంబుల రోసి నిజాత్మతత్వ సం
భావిత లక్ష్యమందు భగవంతుని గాంచి తరించు నీవుగన్.

396 వ పద్యం
తే.గీ. ఐహికార్థిక లబ్ధికై వ్యథలు బడఁగ
జ్ఞానరాజ్యానకై శ్రమల్ కాంచవలదె
రాళ్ళదెబ్బల గోరింట రంగొసంగు
బాధలను బడి భక్తుఁడీశ్వరుని గాంచు.

You may also like...