ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 61| 18th March 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 61
వక్తలు :

  1. శ్రీమతి నల్లపరాజు రాధిక, కువైట్
  2. శ్రీ దాడి వెంకట గంగాచల నాగభూషణం, ఏలూరు

129 వ పద్యము
మాటలు మానివేసి పరమాణువులన్ విడదీసి చూపులో
మాటయియున్న వెల్గు నొకమాటు బహిర్గతమున్ బొనర్చినన్
నాటకరంగమట్టుల గనంబడు విశ్వము స్వర్గలోక మ
చ్చోటఁ జరాచరంబగుచు శోభిలు నీశ్వర జీవరూపముల్.

130 వ పద్యము
ఆదినిగల్గదొక్క యణువై నను తేజముదక్క దానిలో
నాదముపుట్టి యాకళను నాకము జీవులు భూతకోటియై
కాదన కీయజాండము ప్రకాశ మొనర్చెను రెండుగాక యే
కోదధివీచికాకృతి సమున్నతి నీగతి నిన్నెఱుంగగన్.

You may also like...