ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 195| 11th October 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 195

వక్తలు :

  1. శ్రీ యర్రా కృష్ణ కిశోర్, లండన్
  2. శ్రీమతి గోపిశెట్టి చరిత, హైదరాబాద్

399 వ పద్యం
సీ. భక్తియే ముక్తికి బరమమార్గం బని
బోధింపఁ బ్రహ్లాదుఁ బొడిచినారు
శాంతియే సతము నీశ్వరతపం బని చెప్ప
జనఁగ నేసు క్రీస్తుఁ జంపినారు
విశ్వాసమే పరమేశ్వరుండే నని
తెలుప మన్సురు నురిఁ దీసినారు
ప్రేమయే నీశ్వరధామంబు వేఱు లే
దన్న లైలీ వెన్ను దన్నినారు.
తే.గీ. ఇట్టి శాంతిపాఠకు లెంద ఱెంద రిట్టు
లాపదల మున్గి గాన్గుల నాడఁబడిరి
మొహరము కృసైడులా శైవబుద్ధ యుగము
లరసిరేనియు సాధుల వ్యథలు తెలియు.

400 వ పద్యం
సీ. ఈ జ్ఞానమును నేర్చి యీశ్వరుఁ దర్శించి
ప్రాణాలపై యాస వదలినారు
ఈ భక్తి నర్ధించి యింద్రియాటవిఁ ద్రుంచి
యిహలోకవాంఛ వర్జించినారు
ఈ రహస్య మెఱింగి యీర్షలఁ గడ తేర్చి
జీవితంబును బూదెఁ జేసినారు
ఈ తత్త్వమును నేర్చి నీతిని నెదగూర్చి
యీరేడు లోకాలఁ బోరినారు
తే.గీ. ఈ మహారూఢ మార్గంబు నెఱిఁగినట్టి
వారి చర్యలె వేఱు సంసారఘోర
వారినిధివార లున్న దుర్వారవైరి
వారములఁ గూల్చి సాక్షియై వరలుచుంద్రు.

You may also like...