ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 199| 08th November 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 199
వక్తలు :
- శ్రీమతి బుపతిరాజు చంద్రావతి, కేసనకురు
- శ్రీమతి మద్దూరి ఉమాదేవి, హైదరాబాద్
408 వ పద్యం
ఉ. రాజ్యము లాపలేము పరరాజుల నాజి జయింపలేము స్వా
రాజ్య సుఖంబులన్ బడయు భ్రాంతియు లేదు ప్రపంచ భాగ్యముల్
పూజ్యము లింక మాకుఁ గల పూజ్యత యేమి ప్రపంచమందు ని
ర్వ్యాజ్యమునైన జ్ఞానపథమందె కృతార్థత యున్న దారయన్.
409 వ పద్యం
ఉ. ఏది నిజానురాగ మదియేది స్వతంత్రత భ్రాతృలార! వి
ద్యాదయితాస్వరూప మవినాశిత భారతమాత నేఁడు బా
ష్పోదయనేత్రయై పలుకుచున్న దదే యెలుగెత్తి దాస్యసం
పాదిత శృంఖలా వివశభారము దింపఁగలేరె యొక్కటై?
