ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 202| 29th November 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 202

వక్తలు :

  1. శ్రీమతి తిరుమలరాజు లక్ష్మి పల్లవి, USA
  2. శ్రీమతి కుచ్చర్లపాటి గౌరి ప్రియ, హైదరాబాద్

414 వ పద్యం
చ. జడములు రెండు కావొకటి ఛాయ; మఱొక్కటి వస్తు; వందు క
న్పడు సదసత్పదార్థములు నైజముగాఁ దెగిపోయెనేని జీ
వుఁడు జడభావమున్ వదలిపోవును విత్తును వీఁడు మొక్క కై
వడి ఫలసిద్ధివాసనలు పర్వెడు తేజము వచ్చు నాత్మకున్.

415 వ పద్యం
ఉ. కొందఱు పూర్వజన్మయని కొందఱు పాపము పుణ్యమందురా
చంద మెఱుంగనేర కొకసారి నశించిన మృత్తి రెండుగాఁ
జెందును దాని నొక్కయెడఁ జేర్చుట కెవ్వరివల్ల గాదు ని
ష్పందనిరీహ నిర్వృతనిపాతములన్ జడజన్మ కర్మలన్.

You may also like...