ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 36| 24th September 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 36
వక్తలు :
1. డా. నడింపల్లి రామగోపాల వర్మ, హైదరాబాద్
2. శ్రీమతి పింగళి బాలాత్రిపుర సుందరి, విశాఖపట్నం
3. శ్రీ తిరుమలరాజు వి వి నరసింహ రాజు, విశాఖపట్నం

76 వ పద్యము
చీకటియున్ బవళ్ళనెడు చేతులుచాచి రసస్వరూప వి
ద్యాకలశంబుతో నమృతదాన మొనర్చుచు యజ్ఞదీక్ష నా
నాకలుషాపహం బయి యనంత మగాధ మనూన బ్రహ్మత
త్తైకసుధాస్రవంతు లెదబర్వెడు గంటిరె జ్ఞాన సత్కళన్.

77 వ పద్యము
ఎదియొ తరించుదారి పరికింప రనర్థములైన కర్మలన్
గదిసి భవాబ్ధియందు మునుఁగన్ జనుచుందురు గాని విజ్ఞులై
మదిఁ దలఁపోసి యీశ్వరుని మర్మము సృష్టిరహస్య మేమిటో
వెదకరు చూపుమార్చి పృథివిన్ దలమోపిన తెల్లమౌకదా.

78 వ పద్యము
ఆ నిరవద్యమై చెదరనట్టి మహామహనీయతత్త్వ వి
జ్ఞానము సూక్ష్మమార్గములఁ గాంచఁగవచ్చును దాని కిన్నినా
ళ్ళౌనని లెక్కలేదు హృదయంబు పవిత్రతఁ జెందెనేని సో
పానము లెక్కినట్లు భవబంధము వాయుదు రొక్క పెట్టునన్.

You may also like...