ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 65| 15th April 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 65
వక్తలు :

  1. శ్రీ అడబాల వెంకటేశ్వరరావు (వెంకి), నార్త్ కరోలినా, అమెరికా
  2. శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్, న్యూయార్క్, అమెరికా

137 వ పద్యము
దీపము పెట్టి దానిపయి దృక్కులు కేంద్రము జేసెనేని యా
దీపము నొష్టనున్న నిజదీపముతో సయిదోఁడుగాఁగ దృ
గ్రూపము మాఱి పెద్ద వెలుఁగున్ గనవచ్చు సుషుమ్న నుండి యా
చూపు సమాధియై యమృతశోభితమై గనవచ్చు స్వర్గమున్.

138 వ పద్యము
నొట్టను నేలఁ బెట్టి తన నోటను సోహము పాడి రేచకం
బట్టుల గూర్చి పూరకము పట్టున లేపి నిజస్వరూప మా
మట్టునఁ దోఁచుచున్నటుల మార్చి తమస్సును గప్పుకొంటినం
చట్టె తితీక్ష నిల్పుము విహంగతిరస్కరణీ క్రియార్థమున్.

You may also like...