ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 25| 09th July 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 25

వక్తలు :

  1. శ్రీమతి వేగేశ్న రేవతి దుర్గ, విశాఖపట్నం
  2. శ్రీమతి నడింపల్లి సింధూరీ, ఆస్ట్రేలియా

53వ పద్యము.
ఏన్నో బాధలు బొందుచుండుమని నన్నీ భూమి వర్జించి యా
పున్నెంపుంగని అగ్భరేగె దివికిన్ బూర్ణేందుబింబంబు వా
ర్ధిన్ నిద్రింపఁగఁబోయినట్లిఁక మహాంధీభూతమాలిన్యసం
ఛన్నాస్మన్వినిషిద్ధజీవిత మభావం బెన్నినాళ్ళుండినన్.

54వ పద్యము
ఏమాట చెప్పిన నెదురురాఁడగాలేదు
పరమసాధ్వీత్వంబు వరలుకతన
ప్రాణాల నర్పించి పరిచర్యలను జేసె
పరమహర్షంబు ముందరను నిలువ
కలిమిలేములను నొక్కటిగాఁగఁ గణియించె
నిత్యకల్యాణంబు నెలకొనంగ
ఏవురు కొడుకుల నిద్దరు కూఁతుల
ననిశంబు దీవించు నాత్మశాంతి.
ప్రతిదినంబును చదువు ఖురాన్నమాజు
శౌచశీలాన నలువది వత్సరములు
ధరణి జీవించి స్వర్గాన కరిగె ఆగ్బ
రాంబ దివిజులు నీరాజనంబులిడఁగ.

You may also like...