ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 70| 20th May 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 70
వక్తలు :

  1. కుమారి మోపిదేవి అనిత, పైడిపర్రు
  2. శ్రీమతి పెరిచర్ల శ్వేత , కూర్మన్నపాలెం, విశాఖపట్నం

147వ పద్యం
స్వర్గమటన్న సంకుచిత భావము లన్నియు మానివేయు మా
మార్గము భూమి వైభవ రమాపరివర్తిత భోగభాగ్య నై
సర్గిక మంచు నెంచకు నిశన్ గల రిక్కను బిల్చి నీవుగా
నిర్గమనంబు జేసి దివినిన్ దివిజాళిని చూడు తెల్లమౌ.

148వ పద్యం
ఒక దృష్టిన్ దనవంకఁ బెట్టి తనలో నున్నట్టి విశ్వంబు యీ
ప్రకృతిన్ జూచినయట్టి భావమున సంభావించి బ్రహ్మస్వరూ
పకలాంబున నిన్ను బెట్టి యది సర్వస్వంబుగా నెంచినన్
గకుబంతంబుల వార్తలెల్ల విననౌ కళ్యాణసంధానమై.

You may also like...