ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode -24| 02nd July 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 24

వక్తలు :

  1. శ్రీమతి దేశి రెడ్డి గాయత్రీ, మలేషియా
  2. శ్రీమతి అక్కపోలు సాయి లిఖిత, హైదరాబాద్

51వ పద్యము.
ఆ ఢిల్లీనగరాంగ్ల శాసనసభాభ్యర్థిత్వ మర్థింపుఁ డం
చాడన్ నేను కృతార్థుఁడై జనిన నాకై వచ్చి ప్రాణంబులున్
వీడెన్ నా సతి అగ్బరాంబిక చలద్విద్యుల్లతన్ బోలె యీ
నాఁడే నశ్రులు “గోరి” పై విడుచుచున్ వర్తింతు నిర్జీవినై.

52వ పద్యము
ఏను రచించినట్టి కృతు లెన్నిటినో వినె తల్లి ; తండ్రి నా
నానవనాటక ప్రకరణంబులు నాడఁగ జూచినారు ఢీ
ల్లీనగరాంగ్ల భారతమహీధవ శాసనసభ్య సత్పదం
బానఁగఁ గాంచి “అగ్బరమరాలయమేగె” వెలుంగుచుక్కయై.

You may also like...