ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 75| 24th June 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 75
వక్తలు :

  1. శ్రీమతి దుగ్గన భాస్కర లక్ష్మి పార్వతి, ఏలూరు
  2. శ్రీమతి యర్ర కమల రత్నం , లండన్, UK

157 వ పద్యము
గీతలు నడ్డదిడ్డముగ గీసి దృగంచలమందు బెట్టి యే
దో తన రూపు చూపునకుఁ దోఁచెడు రీతిని కేంద్రమైన దృ
గ్జాతములోనఁ జూచుచు నిగారపు తెల్వి మరల్చి యా మహా
ఖాత రసార్ణవంబునఁ బ్రకంపితమై దివిఁ గానవచ్చెడున్.

158 వ పద్యము
ప్రాకటమైన జ్ఞానపథపద్ధతి కొంత విచిత్రరీతులన్
గైకొనవచ్చు నీ నిజము కాదనరాదొక చంద్రహాసమున్
జేకొని సాధకుండు తన చిత్తము శాంతసమాధి నుంచి యా
లోకన చేసెనేని తనలో వెలుఁగొక్కెడ మోసులెత్తెడున్.

You may also like...