ది. 22 నవంబర్ 2019 శుక్రవారం రాత్రి నరేంద్రపురం గ్రామం, రాజానగరం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్యకర్త శ్రీ అత్తి రామ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో శ్రీ సిద్దిరెడ్డి వీర వెంకటరావు గారు, శ్రీమతి దుర్గా వరలక్ష్మీ గార్ల దంపతుల స్వగృహం లో కార్తీక మాసం స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 22 నవంబర్ 2019 శుక్రవారం రాత్రి నరేంద్రపురం గ్రామం, రాజానగరం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్యకర్త శ్రీ అత్తి రామ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో శ్రీ సిద్దిరెడ్డి వీర వెంకటరావు గారు, శ్రీమతి దుర్గా వరలక్ష్మీ గార్ల దంపతుల స్వగృహం లో కార్తీక మాసం స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ఆరాధనలో శ్రీ సిద్దిరెడ్డి వీర వెంకటరావు గారు తమ అనుభవాన్ని సభ్యులతో పంచుకొన్నారు:

ఏడు నెలల క్రితం నేను రాజమండ్రి నుండి ఇంటికి వస్తూ ఉండగా అనుకోని విధంగా ఏక్సిడెంట్ అయి మెడనరములకు దెబ్బతిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్వామి వారి ధ్యాసలో ఉండగా స్వామి లీలగా కనిపించి త్వరలోనే ఉపసమనం కలుగుతుంది అని ఆశీర్వదించారు. తరువాత మా అమ్మ, చెల్లి పిఠాపురం ఆశ్రమంనకు వెళ్ళి గురువు గారికి విషయం వివరించగా గురువు గారు విభూది ప్రసాదం మంత్రించి ఇచ్చి ఆరు వారాల్లో కోలుకొంటాడు అని చెప్పి ఆశీర్వదించారు. గురువుగారు చెప్పినట్లు కోలుకోవడం జరిగింది. గురువుగారి దివ్య ఆశీస్సులతో ఈ రోజు ఆరాధనా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది.

You may also like...