మాతృమూర్తి శ్రీమతి జేహరా బేగం అమ్మ గారి ఐదవ వర్ధంతి, 30 జనవరి 2023 వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించబడినది

30 జనవరి 2023 వ తేదీన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారి మాతృమూర్తి శ్రీమతి జేహరా బేగం అమ్మ గారి ఐదవ వర్ధంతి కార్యక్రమాన్ని హైదరాబాద్ లో డా. కూరపాటి ఈశ్వర ప్రసాద్ వారి గృహం లో ఘనంగా నిర్వహించారు. మాతృదేవోభవ, పితృ దవోభవ, ఆచార్యదేవోభవ అనే భారతీయ సంస్క్రతి ని పరిరక్షించాలని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా పిలుపు నిచ్చారు. జన్మనిచ్చిన మాతృమూర్తే ప్రత్యక్ష దైవం అని శ్లాఘించారు. ప్రతీ ఒక్కరూ తల్లితండ్రులను, గురువును గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా, వారి సోదరుడు మెహబూబ్ పాషా పాల్గొని స్వీట్స్ , భోజనం, మరియు ఒక్కొక్కరికి రెండు దుప్పట్లు చొప్పున హైదరాబాద్ ఎల్లమ్మ బండ లో ఉన్న Qasim Ul Qloom మదార్శా లో 30 మంది పిల్లలకు అందచేశారు. ఈ కార్యక్రమంలో JNTU ప్రొఫెసర్ డా. కూరపాటి ఈశ్వర ప్రసాద్ శ్రీమతి స్వర్ణలత దంపతులు మరియు శ్రీ వాకాడ లక్ష్మణ్ శ్రీమతి సూర్య లత దంపతులు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇట్లు
శ్రీమతి కె. స్వర్ణ లత
హైదరాబాద్

You may also like...