ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 111| 2nd March 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 111
వక్తలు :
- శ్రీమతి కొర్రా వరలక్ష్మి, కాకినాడ
- శ్రీమతి యిర్రి ఉమా పద్మ, అత్తిలి
229 వ పద్యము
రాజ్యము చేయుచున్న మఱి రాలను మోయుచు బానిసీల వా
ణిజ్యము చేయుచున్నను తృణీకృతభద్రపురందరుండవై
వ్యాజ్యము మాని మానసము ప్రాప్తములైన ఫలాప్తి తృప్తి సా
మ్రాజ్యముగాఁగ నమ్ము మదిరమ్మును త్రావినవాని పోలికన్.
230 వ పద్యము
మేము తపస్సమాధులను మేల్ముసుగుల్ పెకలించి మింటిసౌ
దామినులందు వెన్నెలల తళ్కులు బుట్టు మెఱుంగుపెట్టి స్వ
ర్ధామము తొంగి చూడఁగల దారులు చెప్పి నిశాకవాటముల్
వ్యోమమునందె విప్పినటులుంచితి మాదెస వేఁగుచుక్కలన్.