ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 62| 25th March 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 62
వక్తలు :

  1. శ్రీ చిటికెల సత్యనారాయణ, జగన్నాధపురం
  2. శ్రీమతి ఉప్పల నూకరత్నం, కాకినాడ

131వ పద్యము
కాలిన లోహముల్ జలము గైకొనినట్లు తపస్సమాధిలోఁ
గ్రాలెడు మానసంబు కడఁగంటను దేనిని జూచినన్ యథా
లీల గ్రహింపఁగల్గు నవలీల శిరంబు తపంబు సేయుచున్
నేలకు వంచెనేని ధరణిం గలశక్తిని లాగునెంతయున్.

132వ పద్యము
ప్రాతవి పుస్తకంబులను వ్రాసిన తత్త్వపథంబులన్ యథా
రీతి పరిత్యజించి యొక రేఖను కాగితమందు గీసి యా
గీఁతకొనన్ దృగంచలము కేంద్రము చేసిన నందు విశ్వసం
జాతము చూడవచ్చు తన స్వాంతమె యద్దముగాగ నెంతయున్.

You may also like...