ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode -12| 09th April 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 12

వక్తలు :
చిరంజీవి ఘంటా సూర్య మోహినీష్
శ్రీమతి నంబూరి శిరీష

22వ పద్యము:
ఆతనికిన్ మహామహుఁడు నై జనియించి జయైక లోకవి
ఖ్యాతి గడించి యౌగిక మహత్మ్యము లంది “కహేనెషావలీ”
పూతచరిత్రుఁ డాతఁడు ప్రపుణ్యుఁడు మాకుఁ బితామహుండు మా
యాతిమసాప్తికిన్ ద్యుమణియై విలసిల్లెను తత్త్వదీక్షలన్.

23వ పద్యము:
వినిపించె పెక్కు భవిష్యదర్ధంబులు
నానా ప్రపంచవిజ్ఞానగరిమ
అగపర్చె పెక్కు మహత్మ్యంబు లధ్యాత్మ
విద్యాప్రభావంబు వెలయునట్లు
శోధించె హృదయవిశోభిత తేజఃప్ర
పంచంబు నాకసోపానపంక్తి
సాధించె వివిధ కళాధామములలోని
యమృతస్వరూప దివ్యానుభూతి
అట్టిమహనీయమూర్తి మహామహుండు
యోగవిజ్ఞానశక్తిచే నుభయలోక
ములను సంచార మొనరింపఁగలిగినట్టి
శ్రీకహెనెషావలీని వర్ణింపఁ దరమె.

You may also like...