ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 37| 01st October 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 37
వక్తలు :

  1. శ్రీ యర్ర వరహాల బాబు, హైదరాబాద్
  2. శ్రీమతి సంకు పార్వతిదేవి, హైదరాబాద్

79 వ పద్యము
ఆ పరలోక జీవితమె యారయ శాశ్వత మెల్లవారి కే
లోపము లుండఁబోవు తనలోపలనున్న యథార్థవస్తువే
కాపుర ముండు నచ్చట నఖండసుఖైక రసప్రధానమై
దీపముబోలె వెల్గు తన తేజము నీశ్వరతేజ మొక్కటై.

80 వ పద్యము
గర్భవాసమునందు జ్ఞానంబు నేర్చెను
నసురబాలకుఁడు ప్రహ్లాదుఁడరయ
అయిదేండ్లప్రాయాన హరిని సందర్శించి
కొండెక్కిపోయె ధృవుండు గంటె
బాల్యమందరసి తపస్సమాధిని పర
మాత్ముఁ గాంచిరి సనకాదిఋషులు
ఏడేండ్లనాఁడు కొండాడ నల్లా మహా
మతిని గాంచెను మహమ్మద్రసూలు
ఇట్లుభక్త వతంసులు నెందరెంద
రీశ్వరుని గాంచి తరియించి యిద్ధకీర్తి
గాంచిరో నేఁడు గ్రంథాలఁ గాంచగలరు
వారుపోయిన పోలేదు వారి యశము.

You may also like...