ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 251| 07th November 2026
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 251
వక్తలు :
- కుమారి కటకం ఉమానందిని, తిమ్మాపురం
- శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి, అమెరికా
ఓం శ్రీ సద్గురుభ్యో నమః
సూఫీ వేదాంతదర్శము
512 వ పద్యము
ఉ. ధారణయందు హంస నొకతట్టున నిల్పి సమాధియందు నోం
కారము పాడు ప్రాణ లయకారము మాటున దాఁగియున్న నీ
చారు సువర్ణరూప మపచారములన్ విడువంగఁబోకు మా
దారి సమాధి జీవునివిధంబు నెఱుంగుము నీశ్వరాకృతిన్.
513 వ పద్యము
ఉ. ఆరయ బ్రహ్మరంధ్రము సహస్రము గాదు శరీర కోశ మా
గారము ముక్తకంఠ నయగారము వీడిన హంస యౌగికా
కారము దాల్చిపోవు నధికారము వచ్చును దానియిక్క నీ
తీరు నెఱుంగ కీతనువు తెన్నవరోధము సేయు టొప్పునే.
