ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 85| 02nd September 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 85

వక్తలు :

  1. శ్రీ సువ్వాడ చంద్రశేఖర్, హైదరాబాద్
  2. శ్రీమతి అవ్వారి లక్ష్మి, అమెరికా

177 వ పద్యము
నిన్నున్ జూచెడు కోర్కె యున్న నెదలో నిర్నిద్రతేజంబులై
యెన్నో మార్పులఁ జెంది నీ యెదుట నెంతే నిల్చు లీలాకృతుల్
భిన్నంబై యొక వ్యక్తి దాల్చియు భవద్ భ్రూమధ్యతేజంబులో
నున్నానంచు నెఱుంగనేర్తువు మహోద్యోగంబు సంధిల్లగన్

178 వ పద్యము
నిన్నున్ జూచెడి కోర్కె యున్న నెదలో నిర్వాణతేజంబు రా
గౌన్నత్యంబు ఘటింపఁజేసి యది నీవై నిన్ను బ్రహ్మాండమం
దెన్నో రూపులుగాగ మార్చునెడ నందేదో త్వదీయాకృతిన్
భిన్నంబై కనవచ్చు నీశ్వరునిగా భ్రూమధ్య భాసిల్లుచున్

You may also like...